Header Banner

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! 4.24 కోట్లకు పైగా రైస్ కార్డులు జారీకి రంగం సిద్ధం!

  Thu May 22, 2025 15:18        Politics

విజయవాడలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశంలో వెల్లడించినట్లుగా, రాష్ట్రవ్యాప్తంగా మే 7 నుంచి రైస్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేపట్టడం ప్రారంభించామని తెలిపారు. ఈ-కేవైసీ తప్పనిసరని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో, దేశంలో 95 శాతం ఈ-కేవైసీ పూర్తిచేసుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. అడ్రస్ మార్చాలని 12,500 మంది దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాలకు రైస్ కార్డుల డేటాను అనుసంధానం చేశామని, రేషన్ దరఖాస్తులకు గడువు లేదని, ఎప్పుడైనా దరఖాస్తు చేయొచ్చని తెలియజేశారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరికీ తెల్ల కార్డులు అందిస్తామని, జూన్‌లో 4,24,59,128 మందికి కొత్త రైస్ కార్డులు జారీ చేస్తున్నామని చెప్పారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో భూసేకరణ! ఇక 8 గంటల్లో విశాఖ!

 

 

కార్డుదారుల సమాచారం డేటాబేస్‌లో ఉంచి ప్రజలకు స్మార్ట్ రైస్ కార్డులు అందించే ప్రక్రియలో ఉన్నామని చెప్పారు. రేషన్ కార్డు కోసం మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదని, పెళ్లికి సంబంధించి ఫోటో కూడా అక్కర్లేదని స్పష్టం చేశారు. పెళ్లి కార్డులతో సంబంధం లేకుండా దరఖాస్తులు తీసుకోవాలని సూచించారు. కార్డులో కొత్తగా పేర్లు చేర్చాలన్నా పరిశీలించి వెంటనే చేర్చాలని, ఒక పేరు తొలగించాలంటే తప్పనిసరిగా డాక్యుమెంట్ ప్రూఫ్ ఉండాలని తెలిపారు. కుటుంబ సభ్యుల్లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మార్పులు కూడా చేస్తున్నామని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు మార్పులు చేపడుతున్నామని చెప్పారు. కొత్త రైస్ కార్డుల జారీలో ఎక్కడా జాప్యం లేదని, దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోపే కొత్త కార్డులు అందజేస్తున్నామని తెలిపారు. ఎప్పుడైనా దరఖాస్తు చేస్తే పరిశీలించి కొత్త కార్డులు ఇస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!


హైదరాబాద్‌లో మయన్మార్ వాసుల కలకలం..! నకిలీ పత్రాలతో ఆధార్, పాన్!


ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

 

ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!


టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!


అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!

 

పాఠశాలల్లో రోజూ ఒక గంట యోగా తప్పనిసరి! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!


విమానానికి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం! 160 మంది ప్రయాణికులతో..



అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..!

 

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


 

 


   #APRationCardUpdate #RiceCardChanges #E-KYC #SmartRationCard #NadendlaManohar #APGovernment #RationCardApplication #NoDeadline #RationCardAddressChange #FoodSecurity #PublicWelfare #DigitalIndia #RationCardServices #APFoodSupplies #CitizenFirst